KTR: వీహెచ్‌కు రాజ్యసభ ఎందుకు ఇవ్వరు?

by Gantepaka Srikanth |
KTR: వీహెచ్‌కు రాజ్యసభ ఎందుకు ఇవ్వరు?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేసిన అభిషేక్ మను సింఘ్వీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో కేటీఆర్ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుడిని చేయడానికి తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక్క మంచి నాయకుడు లేడా? అని ప్రశ్నించారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి అభిషేక్ సింఘ్వీకి ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీ.హనుమంత రావు(వీహెచ్) లాంటి వారికి రాజ్యసభ ఎందుకు ఇవ్వరు? అని అడిగారు. అంతేకాదు.. రైతుబంధు, రుణమాఫీ ఎప్పుడు చేస్తారో డేట్ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

అదానీ విషయంలో సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీకి మధ్య విభేదాలు ఉన్నాయని కీలక ఆరోపణలు చేశారు. అదానీపై జేపీసీ వేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణకు రాజీవ్ గాంధీ చేసిందేమీ లేదని అన్నారు. కేవలం రాహుల్ దగ్గర మార్కులు కొట్టేయడానికి రేవంత్.. రాజీవ్ విగ్రహం పెట్టాలని నిర్ణయించాడని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు తప్పకుండా మార్చుతామని సంచలన ప్రకటన చేశారు. రాజీవ్ గాంధీ ఒక్క పేరే కాదని.. మిగతా పేర్లు కూడా పరిశీలిస్తామని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ గుర్తులు లేకుండా చేయాలంటే ముందు తెలంగాణే లేకుండా చేయాలని గుర్తుచేశారు.

Advertisement

Next Story

Most Viewed