Eatala Rajendar: నాట్ పాసిబుల్ అనేది నా డిక్షనరీలో లేదు

by Gantepaka Srikanth |
Eatala Rajendar: నాట్ పాసిబుల్ అనేది నా డిక్షనరీలో లేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలందరి ఎదుగుదలలోనే రాష్ట్ర, దేశ భవిష్యత్ ఉందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. వంజర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ తార్నాకలో చేపట్టిన ధర్నాకు ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. వంజర కులానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. తాను ఆర్థిక మంత్రి అయిన వెంటనే అన్ని కుల సంఘాలకు భవనాలు, హాస్టళ్లు ఉండాలని ప్రతిపాదించిన వ్యక్తినని చెప్పారు. 78 కులాలకు హైటెక్ సిటీ వద్ద భవనాలు ఉండాలని కోరుకున్నట్లుగా వివరించారు. కుల సంఘ భవనాలన్నీ ఆత్మ గౌరవ కేంద్రాలుగా వెలసిల్లాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. కుల సంఘాల భవనాలను పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈటల డిమాండ్ చేశారు. ప్రజా నాయకునికి సొంత విశ్వాసాలు ఉండవని, ప్రజల విశ్వాసాలను కాపాడటమే వారి కర్తవ్యమని రాజేందర్ వివరించారు. అంబేద్కర్ సూచించిన విధంగా డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ తన లక్ష్యంగా ఈటల చెప్పుకొచ్చారు. నాట్ పాసిబుల్ అనేది తన డిక్షనరీలో లేదని రాజేందర్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed