కాళేశ్వరం ప్రాజెక్టుపై భ్రమలు కల్పించి మార్కెటింగ్ చేసుకున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

by Nagaya |
కాళేశ్వరం ప్రాజెక్టుపై భ్రమలు కల్పించి మార్కెటింగ్ చేసుకున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి
X

దిశ నిజామాబాద్ సిటీ : కాళేశ్వరం ప్రాజెక్టుపై భ్రమలు కల్పించి కేసీఆర్ మార్కెటింగ్ చేసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డితో కలసి నిజామాబాద్ సారంగపూర్ పంప్ హౌస్ సందర్శించారు. సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సాగు, తాగు నీటి అవసరాలు తీర్చేందుకు కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం నిర్వహించామని ఇందులో భాగంగా ప్రాణహిత చేవెళ్ల డిజైన్ చేశాం అన్నారు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో 9వ ప్యాకేజీ పనులు ఆపేశారని విమర్శించారు. రీ డిజైన్ పేరుతో ధన దాహం కోసం అంచనాలు పెంచారని, కమీషన్ల కోసమే డిజైన్లు మారుస్తున్నారని, కాంగ్రెస్ ఎత్తిపోతల పథకాలను కేసీఆర్ తిప్పి పోత పథకాలుగా మార్చారని దుయ్యబట్టారు. కేసీఆర్ దోపిడీకి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు బలైందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరగని వివక్ష నేడు తెలంగాణలో జరుగుతోందని, కేసీఆర్ కుటుంబం వద్దే ఇరిగేషన్ శాఖలు ఉన్నా రైతులకు ఏమి ఒరిగిందని ప్రశ్నించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జిల్లా అధ్యక్షులు మండల నాయకులు మోహన్ రెడ్డి, కేశవ, వేణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed