- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Kiran Kumar Reddy: వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం.. మాజీ సీఎం సెన్సేషనల్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar Reddy) హెలికాప్టర్ ప్రమాదంపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి (Former CM Kiran Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం విజయవాడ (Vijayawada)లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు గడుస్తున్నా.. నేటికీ రాష్ట్రంలో సమస్యలు అలాగే ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ (BJP), రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉడటంతో విభజన హామీలు, పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం ఆయన మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar Reddy) హెలికాప్టర్ ప్రమాదంపై కామెంట్స్ చేశారు. ఆ రోజు తాను కూడా ఆ హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉందని.. కానీ, పీఏసీ మీటింగ్ (PAC Meeting) ఉందని తెలియడంతో చివరి నిమిషంలో ఆగిపోయానని అన్నారు. ఒకవేళ తను కూడా ఆ హెలికాప్టర్‌లో వెళితే ఖచ్చితంగా చనిపోయి ఉండేవాడినని అన్నారు. తనకు సీఎం పదవి కావాలని ఎవరిని అడగలేదని ఓ రోజు రాత్రి 11 గంటల సమయంలో సోనియా గాంధీ తనకు ఫోన్ చేసి సీఎంగా బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారని వెల్లడించారు.