- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నేడు ఎమ్మెల్యేగా KCR ప్రమాణ స్వీకారం

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు(కేసీఆర్) ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం శాసనభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కేసీఆర్‌తో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా హాజరుకానున్నారు. అనంతరం అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత చాంబర్‌లో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేస్తారు.
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. మ్యాజిక్ ఫిగర్‌కు 60 సీట్లు కావాల్సి ఉండగా.. ప్రజలు 39 స్థానాలకు పరిమితం చేశారు. అధికార కాంగ్రెస్‌కు 64 స్థానాలు అప్పగించారు. ఇక, ఈ ఎన్నికల్లో కేసీఆర్ రెండుచోట్ల పోటీ చేశారు. గజ్వేల్‌లో గెలుపొందగా.. కామారెడ్డిలో రెండో స్థానానికి పరిమితమయ్యారు. అక్కడ అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి గెలుపొందారు. ఫలితాల అనంతరం ఫామ్‌హౌజ్‌కు వెళ్లిన కేసీఆర్ అక్కడ కాలుజారి పడటంతో తుంటి ఎముక విరిగింది. దీంతో ఇంతకాలం రెస్ట్ తీసుకున్న ఆయన.. ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు.