తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలే.. KCR సెన్సేషనల్ కామెంట్స్

by Satheesh |   ( Updated:2024-05-05 14:16:08.0  )
తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలే.. KCR సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రూ. 1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ చెన్నైకి వెళ్లిపోయిందని, అనేక సంస్థలు హైదరాబాద్ నుండి వెళ్లిపోవాలని యోచిస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ కూడా అసూయపడే విధంగా తెలంగాణకు పెట్టుబడులు తీసుకువచ్చామని, ఇప్పుడు ఆ కంపెనీలు వేరే రాష్ట్రానికి వెళ్తున్నాయని అన్నారు. కరీంనగర్ జిల్లాలోని వీణవంకలో ఆదివారం బీఆర్ఎస్ నేతలు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేసీఆర్ మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వంపై ధీమా ఉండాలని, రైతులకు ప్రభుత్వం ఆ నమ్మకం కల్పించాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల కోసం ఎంతో చేశామని తెలిపారు.

దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తొలిసారి రైతు బంధు తెచ్చామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు బంధు బంద్ అయ్యిందని విమర్శించారు. తొమ్మిదేళ్లు ఉన్న కరెంట్ ఇప్పుడు ఎందుకు ఉండటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మంచి నీళ్లు ఎందుకు మాయమయ్యాయి.. గోదావరిలో తెలంగాణ వాటాను ప్రధాని మోడీ తీసుకెళ్తానంటున్నా.. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. కేవలం 4 నెలల్లోనే కాంగ్రెస్‌ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమం అయిపోలేదని.. ఇంకా ఉందని, తెలంగాణ పునర్మిర్మాణం ఇంకా మిగిలే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు మధ్యలో వచ్చిన, చివర్లో వచ్చిన గెలుపు మాత్రమే బీఆర్ఎస్‌దే‌నని జోస్యం చెప్పారు.

Read More...

ఆర్ఎస్పీ ఎదురీత! సవాల్‌గా మారిన నాగర్‌కర్నూల్ గెలుపు

Advertisement

Next Story

Most Viewed