రేపే BRS పార్టీ కీలక సమావేశం.. నరాలు తెగే ఉత్కంఠ పెంచుతోన్న బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ ఎంపిక..!

by Satheesh |
రేపే BRS పార్టీ కీలక సమావేశం.. నరాలు తెగే ఉత్కంఠ పెంచుతోన్న బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ ఎంపిక..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎవరన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లతో అధికారంలోకి రాగా.. బీఆర్ఎస్ 39 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. అయితే బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ నేత ఎవరవుతారు..? ఈ పదవిని పార్టీ చీఫ్ కేసీఆర్ తీసుకుంటారా..? లేక కేటీఆర్, హరీశ్‌రావులలో ఒకరికి అప్పగిస్తారా? అనేది గులాబీ పార్టీలోనూ జోరుగా చర్చలు సాగాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్‌ఎల్పీ లీడర్ (ప్రతిపక్ష నేత) ఎవరనే ఉత్కంఠతకు తెరపడింది. బీఆర్ఎస్ ఎల్పీ లీడర్‌గా పార్టీ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌ను ఎన్నుకోనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం రేపు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్‌లో ప్రారంభం కానుంది. సమావేశ అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీకి వచ్చి.. శాసనసభలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed