BREAKING: కవిత బెయిల్ పిటిషన్ విచారణ స్టార్ట్.. కోర్టు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ

by Disha Web Desk 19 |
BREAKING: కవిత బెయిల్ పిటిషన్ విచారణ స్టార్ట్.. కోర్టు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ అరెస్ట్ చేసిన కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ మొదలైంది. ఈడీ, కవిత తరుఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ అని, లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఆమె ప్రచారం చేయాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కవిత తరుఫు లాయర్ వాదించారు. లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నదని.. ఈ సమయంలో కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరుఫు న్యాయవాది జోహెబ్ హుస్సేన్ కోరారు. ఈ కేసులో కవిత అరెస్ట్ చట్టబద్దంగానే జరిగిందని.. సెక్షన్ 19 ప్రకారమే ఆమెను అరెస్ట్ చేశామని తెలిపారు. కవిత బెయిల్ పిటిషన్‌పై వాడీవేడిగా వాదనలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో కవితకు బెయిల్ వస్తుందా..? మరోసారి నిరాశే ఎదురు అవుతుందా అని బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed