BREAKING: ఎమ్మెల్సీ పదవికి కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా

by Satheesh |   ( Updated:2023-12-08 14:21:18.0  )
BREAKING: ఎమ్మెల్సీ పదవికి కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి సమర్పించారు. కసిరెడ్డి రాజీనామాకు చైర్మన్ గుత్తా ఆమోదం తెలిపారు. కాగా, కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికైన కసిరెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఇవాళ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కాగా, బీఆర్ఎస్ సర్కార్‌లో ఎమ్మెల్సీ పదవి పొందిన కసిరెడ్డి నారాయణ రెడ్డి.. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగాలని ఆశపడ్డారు. కల్వకుర్తి నుండి పోటీ చేయాలని ప్రయత్నాలు చేశారు. కానీ గులాబీ బాస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మరోసారి టికెట్లు ఇవ్వడంతో కసిరెడ్డికి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి.. ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుండి కల్వకుర్తి స్థానం నుండి బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed