- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
యువత నకిలీ ఏజెంట్ల కి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు : ఎస్పీ అఖిల్ మహాజన్
దిశ, చందుర్తి : మన జీవనశైలిలో చదువు, ఉద్యోగంతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనవి యువత చెడు దారి వైపు వెళ్లకుండా ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవలని,మారుమూల ప్రాంతాల ప్రజలు ఐక్యంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. చందుర్తి మండలలోని కొత్తపేట,సనుగుల గ్రామల యువతకు స్పోర్ట్స్ కిట్స్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు అందరు కలిసి ఉండాలని,ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, ప్రజా శ్రేయస్సే పోలీసుల ద్యేయం అన్నారు,యువత చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఉద్యోగాలు సంపాదించి, తమ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని, గ్రామానికి మంచి గుర్తింపు తీసుకురావాలని అన్నారు.
జిల్లాలో కమ్యూనిటీ పోలీస్ లో భాగంగా వివిధ కార్యక్రమాలు పోలీస్ శాఖ తరపున నిర్వహించడాం జరుగుతుందని, మీ యొక్క పిల్లలు చెడు మార్గాల వైపు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది, క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని, స్పోర్ట్స్ కోటా తో కూడా ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని, పోలీస్ శాఖ తరుపున యువతకు ఎల్లవేళలా సహకరించి, ప్రోత్సహిస్తామని అన్నారు.గ్రామంలో అసాంఘిక శక్తులకు సంబంధించిన సమాచారమైనా పోలీసులకు అందించాలని కోరారు. గ్రామాల నుంచి ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్ళేవారు నకిలీ ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని, ఇమ్మిగ్రేషన్, చట్టబద్ధత ఉన్నవారు నుంచి వీసాలు పొందాలన్నారు.గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు లైసెన్స్ గల ఏజెంట్ల వివరాలు తెలుసుకొనుటకు జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ 8712656411 లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ వారిని సంప్రదించవచ్చని సూచించారు.
కొత్తపేట గ్రామ ప్రజలు తమ గ్రామంలో ఉన్న వివిధ సమస్యలు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకరగా జిల్లా ఎస్పీ గారు తమ పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, తమ పరిధిలో లేని సమస్యలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సి.ఐ వెంకటేశ్వర్లు, ఎస్.ఐ అశోక్, సిబ్బంది ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.