- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుల సంక్షేమమే బీజేపీ ధ్యేయం : సింగిరెడ్డి కృష్ణారెడ్డి
దిశ,హుజూరాబాద్ : రైతుల సంక్షేమమే బీజేపీ ధ్యేయమని ఆ పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని పోతిరెడ్డిపేటలో బీజేపీ శక్తి కేంద్ర స్ట్రీట్ కార్నర్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ వివిధ రకాల ఎరువుల సబ్సిడీ కోసం ఎకరానికి రూ. 12 వేలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. అన్ని రకాల రాయితీని తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు ఒక్కటే ఇస్తూ సర్వ రోగ నివారిణిగా ప్రచారం చేసుకుంటుందని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను రాష్ట్రంలోని ప్రతి గడపకు చేరేలా బీజేపీ శక్తి కేంద్రాలు నిరంతర కృషి జరపాలన్నారు.
క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలను బలోపేతం చేయడానికి తగిన కార్యాచరణతో ముందు సాగాలని పిలుపునిచ్చారు. వేలాది రూపాయల సబ్సిడీ భరిస్తూ యూరియా, డీఏపీ, పొటాషియం ఎరువుల బస్తాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతాంగానికి అందిస్తుందని తెలిపారు. అలాగే పీఎం కిసాన్ యోజన కింద ఇప్పటి వరకు 2 వందల యాబై లక్జల కోట్ల రూపాయలను 12 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే టార్గెట్ గా పాటు పడాలని బీజీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు రాముల కుమార్ , నాయకులు భాషవేణి రాజు, పారిపెల్లి కొండాల్ రెడ్డి, చందుపట్ల జనార్ధన్, చిదురాల శ్రీనివాస్ రెడ్డి, నరెడ్ల చైతన్య రెడ్డి, బైరెడ్డి సంపత్ రెడ్డి, మేకల మౌనిక రెడ్డి, కంకణాల తిరుపతి, పరుశరాములు, గాజె సాయిచంద్ పాల్గొన్నారు.