కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 13 సీట్లు క్లీన్ స్వీప్ చేస్తాం : Minister Gangula Kamalakar

by Shiva |   ( Updated:2023-08-21 15:05:09.0  )
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 13 సీట్లు క్లీన్ స్వీప్ చేస్తాం : Minister Gangula Kamalakar
X

దిశ, కరీంనగర్ : తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్ రసమయి బాలకిషన్ లతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ మీడియా సమావేశంల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే సీఎం కేసీఆర్ అంతటి ధైర్యవంతుడిని చూడలేదన్నారు. ఓకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించడం ఆశామాషీ కాదన్నారు.

నమ్మకంతో టికెట్ ఇచ్చిన సీఎం కేసీఆర్ కు జిల్లా పక్షాన ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. పార్టీ ప్రతిష్టను పెంచే విధంగా మా గెలుపుతో పాటు ఇతర నియోజకవర్గ అభ్యర్థులు గెలిచేలా కృషి చేస్తామని వారు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు టికెట్ ఆశించారని, టికెట్ రానివాళ్లు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులుగా భావిస్తూ.. ఏకతాటిపైకి తీసుకువస్తామని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే ప్రజలు బీఆర్ఎస్ కు ఓటు వేయనున్నారని తెలిపారు.

మంథని, హుజురాబాద్ లలో విస్తృత ప్రచారంతో భారీ మెజారిటీతో గెలుస్తామని పేర్కొన్నారు. 50 ఏళ్ల దరిద్య్రాన్ని చవిచూశామనిచ, గడిచిన పదేళ్లుగా కేసీఆర్ పాలనలో ఆనందాన్ని చూస్తున్నామని పేర్కొన్నారు. భయం, భక్తి, క్రమిశిక్షణ, రెట్టింపు ఉత్సాహంతో పాటు ప్రజలకు జవాబుదారీగా పని చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇంక తమ అభ్యర్థులను ప్రకటించే పరిస్థితి లేదని అన్నారు. ఈ సమావేశంలో మంత్రి గంగులతో పాటు ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed