భైంసాలో అల్లర్లకు బీజేపీ నాయకులే కారణం: Vinodh kumar

by S Gopi |   ( Updated:2022-12-01 09:23:48.0  )
భైంసాలో అల్లర్లకు బీజేపీ నాయకులే కారణం: Vinodh kumar
X

దిశ, శంకరపట్నం: తెలంగాణలో భైంసాలో జరుగుతున్న హిందూ ముస్లింల అల్లర్లకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, బీజేపీ నాయకులే కారణమని, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. గురువారం శంకరపట్నం మండలంలోని గొల్లపల్లె, శివారులో గల మొలంగూర్ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న వీఎస్ ఆర్ గార్డెన్ లో టీఆర్ఎస్, బీ ఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గంట మహిపాల్, శంకరపట్నం జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన వినోద్ కుమార్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో శంకరపట్నం మండలం ప్రజలు 22 ఏళ్ల క్రితం టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచారని, నాటి నుండి నేటి వరకు శంకరపట్నం మండల ప్రజలు తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ వైపే ఉన్నారని, మండలంలో టీఆర్ఎస్ పార్టీకి ఆదరణ అభిమానాలు కొండంతగా ఉన్నాయని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించిన మానకొండూరు ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక రథసారధి చైర్మన్ రసమయి బాలకిషన్ కు కేసీఆర్ గుండెల్లో స్థానం ఉందని వినోద్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అన్నారు. తెలంగాణ జెండా ఎంపికలో కీలక భూమిక పోషించిన రసమయి బాలకిషన్ కు ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేను చేయడానికి మానకొండూరు పార్టీ నాయకులు, నియోజకవర్గం ప్రజలు, ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని చూస్తే ప్రజల ఆదరణ అభిమానాలు ఇతర పార్టీల నాయకులకు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు షర్మిల రసమయి బాలకిషన్ కోసం మాట్లాడడం సరికాదని హితవు పలికారు. బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో దళిత క్రైస్తవ సోదరులకు రిజర్వేషన్లు అన్యాయం చేసేందుకు కుట్రలు పన్నుతుందని, అట్టి దళిత బిడ్డలకు షర్మిల ఎలాంటి న్యాయం చేయకుండా అన్ని వర్గాలను ఆదరిస్తున్న టీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేసుకుంటూ పాదయాత్ర చేస్తుందని, ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీపై తప్పుడు మాటలు మానుకోవాలని హితవు పలికారు. లేకుంటే పార్టీ కార్యకర్తలు, నాయకులు తగిన మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు.

ఈ సమావేశంలో మానకొండూరు ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ గణపతి, టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వేణు, జడ్పీటీసీలు శేఖర్ గౌడ్ రవి, ఎంపీపీ సరోజన, వైస్ ఎంపీపీ రమేష్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు సంజీవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డితోపాటు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలతోపాటు నియోజకవర్గంలోని మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story