- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దడ పుట్టిస్తున్న గ్రామ సింహాలు.. గుంపులుగుంపులుగా సంచారం
దిశ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లాలో వీధి కుక్కల సంచారం ఎక్కువైంది. రాత్రి, పగలు తేడా లేకుండా యథేచ్ఛగా తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, రోడ్లపై ఒంటరిగా వెళ్లే వ్యక్తులు, పశువులపై దాడి చేస్తూ గాయపరుస్తున్నాయి. గత ఇరవై రోజుల్లో ముగ్గురు చిన్నారులు ఓ వృద్దుడిపై దాడి చేసి గాయపరచగా తాజాగా కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామంలో ఓ గేదెపై వీధ కుక్కలు దాడి చేసిన ఘటన జిల్లాలో జనాలను కలవర పెడుతోంది. గ్రామాలు, పట్టణాల్లో వీధి కుక్కలు విపరీతంగా పెరిగాయి. రోడ్లపై గుంపులుగుంపులుగా సంచారం చేస్తూ జనాలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
ఇరుకుల్ల గ్రామానికి చెందిన సంకరి కనకయ్య తన గేదెలను వ్యవసాయ బావి వద్ద కట్టేసి రాత్రి ఇంటికి వచ్చాడు. తెల్లవారుజామున ఉదయం 7గంటల వరకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూసే సరికి వీధి కుక్కలు గేదెపై పడి మూకుమ్మడిగా దాడి చేశాయి. గమనించిన కనకయ్య కర్ర సహాయంతో వాటిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నం చేయగా.. కుక్కల తనపై దాడి చేసేందుకు యత్నించడంతో అక్కడి నుంచి తప్పించుకుని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వాదా సమాచారం అందజేశాడు. దీంతో కుటుంబ సభ్యులు పెద్ద కర్రలతో అక్కడికి చేరుకుని కుక్కలను కొట్టడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాయి. విధి కుక్కల దాడిలో గేదెకు తీవ్ర గాయాలు కాగా స్థానిక పశు వైద్యుడు డాక్టర్ రామకృష్ణకు సమాచారం అందించడంతో వారి ఘటనా స్థలానికి చేరుకుని సుమారు రెండు గంటల పాటు చికిత్స చేసి గేదె ప్రాణాలను కాపాడారు.