రైతుల సమస్యలపై నిలదీస్తే మైకులు కట్ చేస్తున్నారు

by Sridhar Babu |
రైతుల సమస్యలపై నిలదీస్తే మైకులు కట్ చేస్తున్నారు
X

దిశ, కరీంనగర్ రూరల్ : కరీంనగర్ పట్టణం గోపాలపూర్ లో గురువారం శ్రీ మల్లికార్జునస్వామి దేవాలయానికి వెళ్లేందుకు బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తులు సులువుగా స్వామిని దర్శించుకునేందుకు కోటి యాభై లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నాం అన్నారు.

కాంగ్రెస్ పాలనలో రైతులకు నీటి కష్టాలు తప్పేలా లేవని అన్నారు. చట్టసభలో రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే మైకులు కట్ చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఊరడి మంజుల మల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తోట తిరుపతి, వైస్ చైర్మన్ గోనె నర్సయ్య, మాజీ వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, మాజీ ఉపసర్పంచ్ సంపత్ రావు, ఆరె శ్రీకాంత్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed