ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్.. ఎస్సై రామ్మోహన్..

by Sumithra |
ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్.. ఎస్సై రామ్మోహన్..
X

దిశ, తంగళ్ళపల్లి : మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై రామ్మోహన్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో తాడూరు చౌరస్తా వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలు సరైన ధ్రువీకరణ పత్రాలు ఉండాలి, మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రుల పై కేసునమోదు చేస్తామని, వాహనాల పై నెంబర్ ప్లేట్లు సరిగా ఉండాలని నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా ఇంటి వద్దనే జరుపుకోవాలని, యువత రోడ్ల పై గుంపులుగా చేరి అల్లర్లు సృష్టించవద్దని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, రాష్ డ్రైవింగ్, చేసిన ఉపేక్షించేది లేదని అన్నారు. డిసెంబర్ 31 రోజున రోడ్లపైన వేడుకలు నిర్వహించొద్దని, కుటుంబంతో కలిసి ఇంట్లోనే సంబరాలు నిర్వహించుకోవాలని సూచించారు. మండల వ్యాప్తంగా 31 అర్ధరాత్రి వరకు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఎస్సై రామ్మోహన్ తెలిపారు.

Advertisement

Next Story