- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భరోసా సెంటర్ ద్వారా సత్వర సేవలు అందించాలి
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధిః బాధిత మహిళలకు, చిన్న పిల్లలకు భరోసా సెంటర్ ద్వారా సత్వర సేవలు అందించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గురువారం రోజున పట్టణ కేద్రంలోని భరోసా సెంటర్ ని సందర్శించి లైంగిక, భౌతిక దాడులకు గురైన బాధితులకు భరోసా సెంటర్ లో కల్పించే న్యాయ సలహాలు, సైకలాజికల్ కౌన్సెలింగ్, వైద్య పరంగా తీసుకుంటున్న చర్యలు, మహిళల వేధింపులపై నమోదు అవుతున్న కేసులు, తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. భరోసా సెంటర్ అందిస్తున్న సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ లైంగిక దాడులకు గురైన బాధితులకు సత్వర సేవలు అందించాల్సిన బాధ్యత భరోసా కేంద్రంపై ఉందని, అత్యాచారం కేసులు జరగగానే సంబంధిత బాధితులను నేరుగా భరోసా సెంటర్ కు తీసుకొని రాగానే చట్ట ప్రకారం వారికి అందించవలసిన సూచనలు సలహాలు తక్షణమే అందించాలని తెలిపారు. పోక్సో, అత్యాచార కేసుల్లో బాధితులకు త్వరగా కాంపెన్సేషన్ ఇప్పించడానికి వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఎస్పీ వెంట టౌన్ సిఐ కృష్ణ, డిసిర్బీ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ జ్యోతి, భరోసా సెంటర్ కోఆర్డినేటర్ శిల్ప, లీగల్ సపోర్ట్ పర్సన్ అనంత, సపోర్ట్ పర్సన్ స్వభావతి, మల్లీశ్వరి, ఏఎన్ఎం పవణిత ఉన్నారు.
- Tags
- crimea
- Telugunews