తెల్ల బంగారానికి రికార్డు ధర

by Sridhar Babu |
తెల్ల బంగారానికి రికార్డు ధర
X

దిశ, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట పత్తి మార్కెట్ లో ఈ ఖరీఫ్ సీజన్ లోనే తెల్ల బంగారానికి గరిష్ట ధర పలికింది. గత వారం రోజులుగా నిలకడగా ఉన్న పత్తి ధరలు బుధవారం అమాంతం పెరిగి క్వింటాలుకు రూ.7800 ప్రైవేటు వ్యాపారులు పత్తిని కొనుగోలు చేశారు. బుధవారం వివిధ ప్రాంతాల నుండి పత్తి రైతులు జమ్మికుంట మార్కెట్ కు 131 క్వింటాళ్ల విడిపత్తిని మార్కెట్ యార్డ్ కు తీసుకువచ్చారు.

గరిష్ట ధర రూ. 7800, కనిష్ట ధర రూ. 7400, మిడిల్ ధర రూ. 7600 లతో ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. కాగా ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుండి పత్తి ధరలు రూ. 7000 నుండి రూ.7600 వరకు పలకగా, నేడు( బుధవారం) అమాంతంగా రూ.400 పెరిగి రికార్డు స్థాయిలో ధరలు నమోదు అయ్యాయి. దీంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా అంతర్జాతీయ మార్కెట్లో పత్తి గింజలకు, పత్తి బేళ్లకు డిమాండ్ పెరిగిన కారణంగానే పత్తి ధరలు పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Next Story