- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
93 శాతం ఉత్పత్తి సాధించిన రామగుండం 3 ఏరియా : జీఎం
by Nagaya |
X
దిశ, రామగిరి: ఏప్రిల్ నెలలో రామగుండం-3 ఏరియా 93 శాతం, అడ్రియాల ప్రాజెక్టు ఏరియా 48 శాతం ఉత్పత్తి సాధించినట్లు ఆర్జీ3, ఏపీఏ జీయం ఎన్. సుధాకర్ రావు తెలిపారు. ఏప్రిల్ నెల బొగ్గు ఉత్పత్తి పై మండలకేంద్రంలోని జీయం కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీయం మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో ఆర్జీ3 ఏరియాకు నిర్దేశించిన 5.38 లక్షల టన్నులకు 5.03 లక్షల టన్నులు ఉత్పత్తి సాధించిందని, 7.44 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిగిందన్నారు. అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా 1.68 లక్షల టన్నులకు 0.80 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగిందని, 0.57 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసినట్లు వివరించారు. ఉద్యోగులందరూ బాధ్యతాయుతంగా పనిచేస్తూ సింగరేణి సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలన్నారు.
Advertisement
Next Story