- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వృత్తి నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాలి: ఎస్పీ అఖిల్ మహాజన్
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: పోలీసులు తమ విధి నిర్వహణలో వృత్తి, నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.సోమవారం తంగళ్పల్లి పోలీసు హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన సాయుధ దళ పోలీసుల సమీకరణ కవాతు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించి మొబిలైజేషన్ లో భాగంగా 14 రోజులు శిక్షణ తీసుకున్న పరేడ్, స్క్వాడ్ డ్రిల్, లాఠీ డ్రిల్ లో శిక్షణ పొందిన సిబ్బందిని, మాబ్ ఆపరేషన్ డాగ్ స్క్వాడ్ లో పనిచేస్తున్న జాగిలాల ప్రతిభను వీక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. పోలీస్ సమీకరణ కవాతు ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా సాయుధ దళ పోలీసులకు రెండు వారాలు శిక్షణనిచ్చామని తెలిపారు ఇందులో భాగంగా ఆర్మ్ డ్ రిజర్వ్ / సాయుధ దళాలు యాన్యువల్ మొబిలైజేషన్ శిక్షణలో ఆర్మ్స్ డ్రిల్, లాఠీ డ్రిల్, ఫుట్ డ్రిల్, సెర్మొనల్ డ్రిల్, గార్డ్ మౌంటింగ్, మాబ్ఆపరేషన్, ఫైరింగ్, నాకబంది, పికెట్స్, వీఐపీ బందోబస్త్, ప్రిసెనరీ, క్యాష్ ఎస్కార్డ్స్, లా అండ్ ఆర్డర్ వంటి అంశాలపై శిక్షణనిచ్చామన్నారు.
పోలీస్ ఉద్యోగం ఎంతో బాధ్యతాయుతమైందని, మారుతున్న పరిస్థితుల క్రమంలో సాయుధ దళ సిబ్బంది సైతం శాంతి భద్రతల పరిరక్షణ, బందోబస్తు విధులలో కీలక పాత్ర వహిస్తున్నారని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ సమయంలో కోపం వచ్చినప్పటికి ఆవేశం ప్రదర్శించకుండా సంయమనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా విచక్షణ కోల్పోకుండా ప్రజల హక్కులను కాపాడుతూనే శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత మనపైన ఉందని గుర్తుంచుకోవాలని తెలిపారు.
ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ శాఖ ప్రతిష్ట, ప్రజల్లో పోలీసుల పట్ల ఉన్న గౌరవం దిగజారకుండా చూడాల్సిన బాధ్యత క్షేత్ర స్థాయి సిబ్బందిపైనే ఉందన్నారు. ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బంది మొత్తం ఒకే దగ్గరకు వచ్చి శిక్షణా సమయంలో నేర్చుకున్న అంశాలను మరోసారి గుర్తు చేసుకునే అవకాశం మోబిలైజేషన్ తో కలుగుతుందన్నారు. వ్యాయామం, యోగా నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ లు విశ్వప్రసాద్, రవికుమార్ ఆర్.ఐ కుమారస్వామి, రజినీకాంత్, యాదగిరి, సీఐలు అనిల్ కుమార్, ఉపేందర్, నవీన్ కుమార్, ఎస్.ఐలు, ఆర్.ఎస్.ఐ, ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బంది పాల్గొన్నారు.
- Tags
- SP Akhil Mahajan