జగిత్యాలలో ఓపెన్ ఇంటర్ పరీక్ష వాయిదా

by Shiva |
జగిత్యాలలో ఓపెన్ ఇంటర్ పరీక్ష వాయిదా
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాలలో మంగళవారం నిర్వహించాల్సిన ఓపెన్ ఇంటర్ పట్టణ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎకనామిక్స్ పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులకు తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ కు బదులుగా ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్లు రావడంతో పరీక్ష వాయిదా పడినట్లుగా తెలుస్తుంది. క్వశ్చన్ పేపర్లు వచ్చిన కవర్ పైన తెలుగు మీడియం అని రాసి ఉండగా కవర్ ఓపెన్ చేయగా అందులో ఇంగ్లీష్ మీడియం పేపర్లు ఉన్నట్లుగా తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో ఎగ్జామ్ సెంటర్ కి వచ్చిన విద్యార్థులను అధికారులు బయటకు పంపించి వేశారు. అయితే, త్వరలోనే మళ్లీ పరీక్ష నిర్వహించే తేదీని విద్యార్థులకు తెలియజేస్తామని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed