'దిశ ఎఫెక్ట్' .. మోడల్ చెరువు కట్టు కాలువలను పరిశీలించిన అధికారులు..

by Disha Web Desk 23 |
దిశ ఎఫెక్ట్ .. మోడల్ చెరువు కట్టు కాలువలను పరిశీలించిన అధికారులు..
X

దిశ, హుజురాబాద్ రూరల్: మోడల్ చెరువు కట్టు కాలువలను ఇరిగేషన్ , రెవెన్యూ ,మున్సిపల్ అధికారులు మంగళవారం పరిశీలించారు . మోడల్ చెరువులు 'కట్టు కాలువలు ఎక్కడ..? అనే కథనం గత శనివారం దిశ పత్రికలో ప్రచురితమైంది.దీనికి స్పందించిన ఇరిగేషన్ ఏఈ రవిచంద్ర, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ నాయిని అశ్విని గాంధీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేఖర్ లు మోడల్ చెరువు నుండి వచ్చే నాలుగు కట్టుకలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఎఈ రవి చందర్ మాట్లాడుతూ... మోడల్ చెరువు కట్టు కాలువలు పూడ్చివేసినట్లు గుర్తించామని వాటిని సర్వే చేయించి సరి చేస్తామని తెలిపారు. కట్టు కాలువలు ఆక్రమించిన ఆక్రమణ దారులపై చర్యలు తీసుకునేందుకు పై అధికారులకు నివేదిక సమర్పిస్తామని అన్నారు. వీరి వెంట ముదిరాజ్ సంఘం నాయకులు కొలిపాక సమ్మయ్య ఉన్నారు.



Next Story

Most Viewed