- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉనికిని చాటుకునేందుకే రేవంత్ రెడ్డిపై బురద : ఎన్.ఎస్.యూ.ఐ రాష్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్
దిశ, హుజూరాబాద్: రాష్ట్రంలో తన ఉనికిని చాటుకునేందుకే ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బురద చల్లుతున్నారని ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర అధ్యక్షుడు, హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి బల్మూర్ వెంకట్ అన్నారు. శనివారం అయన విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు పర్యాయాలు మంత్రి పదవిలో ఉన్న ఈటలకు సీఎం కేసీఆర్ చేసిన అవినీతిలో వాటా ఉందని ఆరోపించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ అవినీతిపై సీబీఐ విచారణ ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గల్లీలో లొల్లి చేస్తూ ఢిల్లీలో దోస్తాన్ చేస్తున్నాయని విమర్శించారు. ఈ రెండు పార్టీల కుమ్మక్కై రాజకీయాలను బ్రష్టు పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువకులను మోసం చేసిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.
తెలంగాణ ఉద్యమకారులకు కనీస గౌరవం ఇవ్వని కేసీఆర్ ఉద్యమకారులపై రాళ్లు రువ్విన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఎలా కట్టబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. 2021 ఉప ఎన్నికల సమయంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి బంధువని చెప్పుకొని మోసం చేసిన చరిత్ర ఎవరిదో అందరికి తెలుసన్నారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ చేస్తున్న కుమ్మక్కు రాజకీయాలను తిప్పి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజల సమస్యలపై స్పందిస్తున్న తనను వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ ఓటర్లు ఆశీర్వదిస్తారనే విశ్వాసం తనకు ఉందన్నారు.