- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాజకీయాల్లో ఆయనను మించిన అవకాశవాది లేరు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
దిశ, జగిత్యాల ప్రతినిధి: రాష్ట్రానికి సీఎం కేసీఆర్ చీడలా దాపరించారని రాజకీయాలలో ఆయనను మించిన అవకాశవాది మరెవరు లేరని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రం లోని దేవిశ్రీ గార్డెన్స్ లో యూత్ జోడో.. బూత్ జోడో నినాదంతో బూత్ స్థాయి కార్యకర్తల శిక్షణ కార్యక్రమం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా మధు అధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు, యువకుల బలి దానాలతో ఏర్పడిన తెలంగాణ లక్ష్యం నీరు గారిపోయిందన్నారు. కెసిఆర్ పాలనలో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలను అంగట్లో అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అర్హత నైతికతను కోల్పోయాడన్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ కేంద్రంలో బిజెపి ప్రజలకు పెద్దగా చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ గెలుపులో యూత్ కాంగ్రెస్ ది కీలక పాత్ర అని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ని అధికారంలో తీసుకువచ్చేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడి లాగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ సేన రెడ్డి, ఏ ఐ సీ సీ సెక్రెటరీ, సురభి అర్పిత, శ్రీనివాస్, పిసిసి సభ్యులు గిరి నాగభూషణం ఇతర యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.