Weather Alert: రాష్ట్రంలో చంపేస్తోన్న చలి.. రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు

by Shiva |
Weather Alert: రాష్ట్రంలో చంపేస్తోన్న చలి.. రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. దీంతో జనాన్ని చలి చంపేస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలు వివిధ పనుల కోసం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనాలు జంకుతున్నారు. ఓ వైపు చలికి తోడు పొగమంచు, ఈదరుగాలులతో చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ (North Telangana) జిల్లాల్లో రికార్డు స్థాయిలో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌ (Adilabad), కొమురం భీం ఆసిఫాబాద్‌ (Komuram Bheem Asifabad), నిర్మల్‌ (Nirmal) జిల్లాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది.

హైదరాబాద్ (Hyderabad) నగరంతో పాటుగా శివారు ప్రాంతాల్లో మంచు కప్పేసింది. చాలా ప్రాంతాల్లో 15 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉదయం వేళల్లో ప్రయాణాలు కొనసాగించే వారు పొగ మంచు కారణంగా రహదారులు కనిపించక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రాబోయే మరో ఐదు రోజుల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Department of Meteorology) అధికారులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు వహించాలని.. ఎండ వచ్చే వరకు ఎవరూ బయటకు రాకూడదని వైద్యులు సూచిస్తున్నారు. పొగ మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story

Most Viewed