BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు

by Gantepaka Srikanth |
BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు
X

దిశ, వెబ్‌‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)పై మూడు కేసులు నమోదు అయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్(Sanjay Kumar) పీఏ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్‌(Karimnagar Collectorate)లో నిర్వహించిన సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్(Sanjay Kumar), బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) మధ్య వాగ్వాదం జరిగింది.

అది కాస్త ముదరడంతో ఇరువురు పరస్పరం తోసుకున్నారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయి సమావేశాన్ని గందరగోళంగా మార్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా.. అసలు మీరు ఏ పార్టీ అని కౌశిక్ రెడ్డి నిలదీయడంతో గొడవ మొదలైంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, శ్రీధర్ బాబు సమక్షంలోనే వాగ్వాదం జరుగడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏ ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


Next Story

Most Viewed