ఇంటర్ విద్యార్థిని సన్మానించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్..

by Sumithra |
ఇంటర్ విద్యార్థిని సన్మానించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్..
X

దిశ, సైదాపూర్ : సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వపల్లి గ్రామానికి చెందిన మేడవేని నాగరాణి ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో హెచ్ఈసీలో 489/500 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. దీంతో నాగరాణిని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ బుధవారం సన్మానించారు. విద్యార్థిని పై చదువులకు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రస్తుతం నాగమణి తిమ్మాపూర్ మహాత్మా జ్యోతిరావుపూలే పాఠశాలలో ఇంటర్ మొదటిసంవత్సరం పూర్తిచేసుకుంది.

Advertisement

Next Story