భర్తతో క్యూట్ ఫొటో షేర్ చేసిన హీరోయిన్.. ఒక్క సినిమా తీసి పెళ్లి చేసుకున్నవా అంటూ కామెంట్స్

by Kavitha |
భర్తతో క్యూట్ ఫొటో షేర్ చేసిన హీరోయిన్.. ఒక్క సినిమా తీసి పెళ్లి చేసుకున్నవా అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సాయి కిరణ్ అడవి(Sai Kiran Adavi) డైరెక్షన్‌లో వచ్చిన ‘కేరింత’(Kerintha) సినిమా ఎంత మంచి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీలో సుమంత్ అశ్విన్(Sumanth Ashwin), పార్వతీశం(Parvateesam), విశ్వంత్ దుడ్డుంపూడి(Viswanth), సుకృతి అంబటి(Sukrithi Ambati), తేజస్వి మదివాడ(Tejaswi Madivada), శ్రీదివ్య(Divya Sree) కీ రోల్స్ పోషించారు. ఇక ఈ మూవీకి మిక్కీ జే మేయర్(Mickey J Meyer) మ్యూజిక్ అందించారు. అయితే ఈ చిత్రంలో పార్వతీశంకు జోడిగా నటించిన హీరోయిన్ సుకృతి అంబటి మనందరికీ తెలిసిందే. కేరింత మూవీ తర్వాత తను పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.

పెళ్లి చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్‌ను లీడ్ చేస్తోంది. కేరింత మూవీలో భావన అనే పాత్రలో చక్కగా నటించి మెప్పించింది ఈ సుందరాంగి. అలా లక్ష్యం లేని యువకుడు (పార్వతీశం)కి గర్ల్‌ఫ్రెండ్‌గా యాక్ట్ చేసిన సుకృతి.. అతనికి క్లాస్ తీసుకున్న తీరు అప్పట్లో యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. చాలా మంది తల్లిదండ్రులు కూడా ఆ సీన్‌ని చూడాలని తమ పిల్లలకు చెప్పేంతలా వారికి కనెక్ట్ అయ్యింది.

ఇదిలా ఉంటే.. కేరింత మూవీ తర్వాత సినిమాలకు దూరం అయిన ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా సుకృతి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో తన భర్తతో దిగిన క్యూట్ ఫొటో షేర్ చేసింది. దీంత ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారగా.. అయ్యో భావన ఒక్క సినిమా తీసి పెళ్లి చేసుకున్నావా అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా సుకృతి.. అక్షయ్ సింగ్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దలను ఒప్పించి వారి సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed