ఆ పరీక్ష రద్దు చేసిన RRB.. మళ్లీ ఎప్పుడంటే?

by Jakkula Mamatha |   ( Updated:2025-04-27 11:51:09.0  )
ఆ పరీక్ష రద్దు చేసిన RRB.. మళ్లీ ఎప్పుడంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 7,951 జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్ తదితర ఖాళీలు భర్తీకానున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఆర్‌ఆర్‌బీ కీలక ప్రకటన చేసింది. ఈ నెల(ఏప్రిల్) 22వ తేదీన జరిగిన RRB జేఈ సీబీటీ-2 రెండో షిఫ్ట్ పరీక్షను RRB రద్దు చేసింది. తొలి షిప్టులో వచ్చిన ప్రశ్నలు కొన్ని రెండవ దాంట్లో రిపీట్ కావడంతో RRB ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సాంకేతిక సమస్య వల్ల ఇలా జరిగిందని అధికారులు వివరించారు.

ఈ క్రమంలో రద్దైన ఈ పరీక్షను సమీప భవిష్యత్తులో నిర్వహిస్తామని RRB వెల్లడించింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ పరీక్ష తాత్కాలిక సమాధాన కీని ఈ నెల 25న విడుదల చేసిన సంగతి తెలిసిందే. 7,951 పోస్టులకు సంబంధించి సీబీటీ-1 పరీక్ష రాసి అర్హత సాధించిన 20,792మంది తాజాగా సీబీటీ-2 రాశారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://rrbsecunderabad.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.



Next Story

Most Viewed