- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి డేట్ ఫిక్స్.. మెహందీ పిక్స్ షేర్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అభినయ(abhinaya)మాట వినికిడి శక్తి లేకపోయినప్పటికీ నటనపై ఆసక్తితో ఇండస్ట్రీకి పరిచయం అయింది. అంతేకాకుండా 2008లో ఆమె ‘నేనింతే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత కింగ్, శంభో శివ శంభో, ఢమరుకం, దమ్ము (dammu), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ది ఫ్యామిలీ స్టార్ (The Family Star)వంటి సినిమాల్లో చేసి తన నటనతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. అంతేకాకుండా తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించడంతో పాటు అవార్డులు కూడా తీసుకుంది. 15 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న అభినయ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ వంటి భాషల్లో సినిమాలు చేసింది. అయితే గత కొద్ది రోజుల నుంచి ఈ అమ్మడు ఓ స్టార్ హీరోతో ప్రేమలో ఉందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ క్రమంలోనే.. అభినయ తన ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ అయినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాకుండా అతనితో తీసుకున్న ఫొటోలను షేర్ చేయడంతో రూమర్స్‌కు చెక్ పడినట్లు అయింది. ఇక అభినయ ఇటీవల తనకు కాబోయే భర్తను కూడా పరిచయం చేసింది కానీ పెళ్లి డేట్‌ను మాత్రం వెల్లడించలేదు. తాజాగా, అభినయ తన ఇన్‌స్టా్గ్రామ్ ద్వారా ఏకంగా మెహందీ ఫొటోలు షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో తన కాబోయే భర్త, ఫ్రెండ్స్‌తో కలిసి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసింది. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట పెట్టడంతో అంతా కంగ్రాట్స్ చెబుతూ పెళ్లి ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు. అయితే వీరి వివాహ వేడుకలు హైదరాబాద్‌లోని ఓ కన్వెన్షన్ హాల్‌లో జరగబోతున్నట్లు టాక్. ఇక వీరి పెళ్లికి టాలీవుడ్ సినీ సెలబ్రిటీలంతా హాజరు కాబోతున్నట్లు సమాచారం.