Manakondur MLA : గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి తక్షణమే స్పందించాలి

by Aamani |
Manakondur MLA : గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి తక్షణమే స్పందించాలి
X

దిశ, బెజ్జంకి: గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి పంచాయతీ కార్యదర్శులు తక్షణమే స్పందించి ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మంగళవారం బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ఎమ్మెల్యే సత్యనారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి అమలు చేసి, గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే స్పందించుటకు తమ వంతు కృషి చేయాలని, ఎలాంటి సమస్య ఉన్న ఉన్నతాధికారుల దృష్టికి తన దృష్టికి తీసుకువచ్చి ప్రజా సమస్యల పరిష్కారంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు కీలకంగా వ్యవహరించి గ్రామాల అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే శాఖ పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఊట్కురి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో కె, ప్రవీణ్, ఆయా శాఖల అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

Next Story