- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లైన 18 ఏళ్లకు పుట్టిన కొడుకు.. చూద్దామని వెళ్తుంటే అనంతలోకాలకు..
దిశ, ఓదెలః అతనికి పెళ్లి అయిన 18 ఏళ్ల తర్వాత కొడుకు పుట్టాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ తండ్రి.. తన కొడుకును చూడాలనే సంతోషంతో హాస్పిటల్ కు బయలుదేరాడు. కానీ మార్గమధ్యలోనే అతన్ని మృత్యవు ఆర్టీసీ బస్సు రూపంలో పలకరించింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా సీసీ శ్రీరాంపూర్ కు చెందిన పెండ్లి రంజిత్ కుమార్ తనకు పెళ్లి అయిన 18 ఏళ్ల తర్వాత కొడుకు పుట్టాడనే వార్త తెలుసుకుని చూసేందుకు తన అత్తగారి ఊరు జీలకుంట గ్రామానికి బయలుదేరాడు. దీంతో జమ్మికుంట నుండి సుల్తానాబాద్ కి వెళ్తున్న హుజురాబాద్ డిపో ఆర్టీసీ బస్సు ఏపీ 15 z0088 ఎదురుగా వచ్చిన బైకును ఢీకొట్టింది. తీవ్ర కాయలవడంతో వెంటనే స్థానికులు 108 లో హాస్పటల్ తరలిస్తున్న తరుణంలో రంజిత్ కుమార్ మార్గమధ్యలో మృతి చెందాడు. ఎస్సై జి అశోక్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని విచారణ చేపట్టి బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించారు. చాలా రోజుల తర్వాత కొడుకు పుట్టాడని తండ్రి సంతోషం ఎక్కువ రోజులు నిలువలేకపోయింది అని కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు అందర్నీ కలిసి వేసింది.