- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'కంటి వెలుగు'ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ భాష
దిశ, కోరుట్ల: ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపడుతున్న 'కంటి వెలుగు' కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ భాష అన్నారు. శుక్రవారం పట్టణంలోని 24వ వార్డులో చేపడుతున్న కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 46 బృందాలతో కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలోని మున్సిపల్, పంచాయితీ అధికారులు, సిబ్బంది సహకారంతో వైద్య సిబ్బందితో కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు.
ఇప్పటి వరకు జిల్లాలో 190 క్యాంపులు పూర్తి చేశామని, 6.2 లక్షల మందికి కంటి వైద్య పరీక్షలు చేపట్టేలా లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటి వరకు 2.32 లక్షల మందికి కంటి పరీక్షలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. రోజు వారిగా ఒక్కో క్యాంపులో సుమారు 150 నుంచి 200 మందికి కంటి పరీక్షలు చేస్తు్న్నామని తెలిపారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో అవసరమున్న వారికి కంటి అద్దాలు, మందులను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వినోద్ కుమార్, డీఎంహెచ్వో శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ ఆయాజ్ తదితరులు పాల్గొన్నారు.