ముగిసిన కాసర వేణి రవి 33 ఏళ్ల విప్లవ ప్రస్థానం

by Disha Web Desk 12 |
ముగిసిన కాసర వేణి రవి 33 ఏళ్ల విప్లవ ప్రస్థానం
X

దిశ, హుజురాబాద్ రూరల్: గత ఐదు రోజుల క్రితం చత్తీస్గఢ్ రాష్ట్రం అబుజ్ మడ్ టేక్ మేటా ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ పూర్వపు కరీంనగర్ జిల్లా నేటి హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన కాశవేన రవి అలియాస్ వినయ్ మృతి చెందాడు. కాగా ఐదు రోజుల అనంతరం భౌతిక కాయం వంగర స్వగ్రామానికి శనివారం నాడు చేరుకుంది. ఈ సందర్భంగా అమరుల బంధుమిత్రుల సంఘం,పౌర హక్కుల సంఘం, దళిత లిబరేషన్ ఫ్రంట్, విరాసం తో పాటు ఇతర ప్రజా సంఘాల నాయకులు ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. తన తండ్రి సింగరేణిలో బెల్లంపల్లి లో పనిచేస్తుండగా సికాస భావాలకు ఆకర్షితుడై 33 ఏళ్ల క్రితం మావోయిస్టు ఉద్యమంలో చేరాడు. అంచెలంచెలుగా దండకారణ్య డివిజన్ కమిటీ సభ్యుడు వరకు ఎదిగారు. ఈ క్రమంలో ఆదివాసుల హక్కుల కోసం, పెట్టుబడిదారీ వ్యవస్థపై అనునిత్యం పోరాటం చేసి న రవి ఎన్కౌంటర్ తో 33 ఏళ్ల ఉద్యమ ప్రస్థానానికి ముగింపు పడింది.

పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కుమారస్వామి మాట్లాడుతూ.. ఆపరేషన్ కగార్ ద్వారా డ్రోన్ల ద్వారా నక్సల్స్ స్థావరాలను గుర్తించి విష రసాయనాలు స్ప్రే చేస్తూ వారు స్పృహ కోల్పోయేలా చేసి బూటకపు ఎన్ కౌంటర్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారుతో అడవిలోని 300 రకాల ఖనిజ సంపదను స్వదేశీ కార్పొరేట్లకు ఇవ్వడానికి సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యాన్ని అడవుల్లో ఉన్న ఆదివాసీల మీదకి ఉసిగొల్పి ఊచకోత కోస్తున్నారని ఆయన అన్నారు. అబూజ్ మడ్ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతర్జాతీయ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఎక్కడా కేసులు నమోదు చేయకుండా గత రెండు నెలలుగా 90 మందికి పైగా ఎన్ కౌంటర్ చేశారని వారు ఆరోపించారు. పెసా చట్టం, ఆర్టికల్ 5, 6 షెడ్యూల్ తక్షణమే అమలు చేసి ఆదివాసుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందన్నారు. ప్రజాస్వామిక హక్కుల సమన్వయ సంఘం దేశవ్యాప్తంగా చేస్తున్న డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు.

Next Story

Most Viewed