ఉత్తర తెలంగాణకు గేటవే గా కరీంనగర్: మంత్రి గంగుల కమలాకర్

by Shiva |   ( Updated:2023-04-10 15:05:32.0  )
ఉత్తర తెలంగాణకు గేటవే గా కరీంనగర్: మంత్రి గంగుల కమలాకర్
X

ఏప్రిల్‌ 14న కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవం

దిశ, కరీంనగర్: ఉత్తర తెలంగాణకు గేటవే గా కరీంనగర్ ఆవిర్భవించనుందని, పట్టణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కలల వారధి కేబుల్‌ బ్రిడ్జి 14న ప్రారంభిస్తామని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు. సోమవారం కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను కలెక్టర్ ఆర్.వీ కర్ణన్, సీపీ సుబ్బరాయుడు తో కలిసి మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ మానేరు నదిపై రూ.224 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. అప్రోచ్‌ రోడ్డు పనులు డైనమిక్ లైటింగ్ సిస్టమ్ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం అనంతరం ప్రతి ఆదివారం ఆదివారం సాయంత్రం 6 నుంచి రాత్రి 12 వరకు సందర్శకులను అనుమతిస్తామని వెల్లడించారు.

ప్రజల సందర్శన నిమిత్తం కొద్ది రోజుల పాటు క్రాకర్ షో, లెజర్ షో, ఫుడ్ ఫెస్టివల్ తో పాటు బ్రిడ్జికి ఇరువైపుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి నగరానికి ఒక పర్యాట కేంద్రంగా ఉంటుందన్నారు. ఈ బ్రిడ్జిపై రూ.6.5 కోట్లతో డైనమిక్‌ లైటింగ్‌ పనులు పూర్తి అవుతున్నాయని తెలిపారు.

అదేవిధంగా మానేరు రివర్ పనులు చురుకుగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్.వీ కర్ణన్, సీపీ సుబ్బరాయుడు, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు బండారు వేణు, వాళ్ల రమణారావు, నేతి కుంట యాదయ్య, కాశేట్టి శ్రీనివాస్, ప్రశాంత్ నేతి, రవివర్మ మిడిదొడ్డి, నవీన్ కర్ర, సూర్య శేఖర్, బట్టు వరప్రసాద్, మొగిలోజు వెంకట్, రవినాయక్, తదితరులు పాల్గొన్నారు

Also Read..

రాష్ట్రంలో 40 వేల మంది లబ్ధిదారులకు దళిత బంధు: మంత్రి కేటీఆర్

Advertisement

Next Story