- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > Jagityala: బాలుడిని అపహరించేందుకు యత్నం.. నిందితుడికి దేహశుద్ధి, పోలీసులకు అప్పగింత
Jagityala: బాలుడిని అపహరించేందుకు యత్నం.. నిందితుడికి దేహశుద్ధి, పోలీసులకు అప్పగింత
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల కిడ్నాప్‌లు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం అబిడ్స్‌లో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైన ఘటన మరువక ముందే జగిత్యాల పట్టణంలో మరో ఘటన చోటుచేసుకుంది. హజారీ కాలనీకి చెందిన ఓ ఐదేళ్ల బాలుడు ఆరుబయట ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో చెత్త ఏరుకునే ఓ గుర్తు తెలియని వ్యక్తి పెద్ద గోనెసంచితో అటుగా వచ్చాడు. దీంతో ఒంటరిగా ఆడుకుంటున్న బాలుడిని అపహరించేందుకు ప్రయత్నించగా.. బాలుడి తండ్రి గుర్తించి ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించాడు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story