అక్రమంగా మట్టి తవ్వకాలు.. ప్రభుత్వ ఆదాయానికి గండి..

by Disha Web Desk 23 |
అక్రమంగా మట్టి తవ్వకాలు.. ప్రభుత్వ ఆదాయానికి గండి..
X

దిశ,గోదావరిఖని: అక్రమంగా మట్టి తవ్వి కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. అయినా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం విడ్డూరంగా ఉంది. సింగరేణి భూముల్లో కొందరు అక్రమార్కులు అక్రమంగా మట్టిని తవ్వి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. దీనిపై అధికారులు సరైన నిఘా పెట్టకపోవడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇంత బహిరంగంగా మట్టి రవాణా సాగుతుంటే అధికారులకు తెలియకుండా ఉంటుందా.. అనే ప్రశ్నలు ప్రజల్లో మొదలవుతున్నాయి.

ఈ మట్టి రవాణా గత ఐదు నెలలుగా యథేచ్చగా జేసీబీ, ట్రాక్టర్లతో గుట్టుచప్పుడు కాకుండా మట్టిని తోడేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే ఈ మట్టి వ్యాపారం నడుస్తుందని స్ధానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చూసి చూడనట్టు వ్యవహరించడంతో పలు అనుమానాలకు తావిస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.



Next Story

Most Viewed