నేను కాళ్లు మొక్కీంచుకునే దోరను కాదు : పొన్నం

by Aamani |   ( Updated:2023-11-02 15:12:20.0  )
నేను కాళ్లు మొక్కీంచుకునే దోరను కాదు : పొన్నం
X

దిశ,సైదాపూర్ : సెంటిమెంట్ హుస్నాబాద్ అంటూ అభివృద్ధి మాత్రం సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు చేస్తున్న ముఖ్యమంత్రిని హుస్నాబాద్ శాసనసభ్యులు హుస్నాబాద్ ను అభివృద్ధి చేయాలని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. మతిమరుపు లేని ఎమ్మెల్యేను ఇంటికి పంపించాలని, నేను కాళ్లు మొక్కించుకునే దోరను కాదని మీలో ఒక్కడిని అంటూ కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యుడు హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం సైదాపూర్ మండలంలోని ఆకునూర్, రాయికల్, బొమ్మకల్, అమ్మనగుర్తి, గుండ్లపల్లి గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్ర కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మతిలేని అసమర్ధత ఎమ్మెల్యేతో హుస్నాబాద్ నియోజకవర్గ వెనుకబడిపోయిందని కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప సైదాపూర్ మండలంలో ఎక్కడ అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు.

కాంగ్రెస్ మాటంటే మాటేనని మాట తప్పే ప్రసక్తే లేదని మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అంతకుముందు మహిళలు పొన్నం ప్రభాకర్ కు మంగళ హారతులతో, కోలాటం, డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దొంత సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిట్టపల్లి కిష్టయ్య, మాజీ జెడ్పిటిసి గుండారపు శోభ-శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు తిప్పారపు సంపత్, ఎంపీటీసీ సభ్యులు చాంద్ బాషా, చాడ చైతన్య కొండారెడ్డి, లంక దాసరి అరుణ-మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వీరమల్ల తిరుపతి రెడ్డి, గోనెల స్వామి, తీగల పద్మనాభం, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story