అకాల వర్షం తెచ్చిన అపార నష్టం

by Disha Web Desk 23 |
అకాల వర్షం తెచ్చిన అపార నష్టం
X

దిశ,వీర్నపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రం తో పాటు మద్ది మల్ల,రంగంపేట, అడవి పదిర, గర్జనపల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోళ్లకు ఆటంకం కలగడంతో పాటు చాలాచోట్ల కోతకు వచ్చిన వరి పంట దెబ్బతిన్నది. చేతికి వచ్చిన పంట వర్షం పాలు అవడం తో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద, రోడ్ల మీద ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి.విక్రయించే సమయంలో ధాన్యం తడవడంతో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు . మండల కేంద్రంలో గ్రామ పంచాయతీకి చెందిన వాటర్ ప్లాంట్ పై కప్పు బలమైన గాలులకు రేకులు ఎగిరిపోయి నెల పై పడ్డాయి. ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పోలీస్ స్టేషన్ సమీపంలో విద్యుత్ తీగలపై వృక్షం కూలింది.మద్ది మల్ల గ్రామంలో భారీ వృక్షం ఈదురుగాలులకు ట్రాక్టర్ పై పడింది.

Next Story

Most Viewed