అభివృద్ధి ఫలాలు అర్హులకు అందాలి.. ఎమ్మెల్యే

by Sumithra |
అభివృద్ధి ఫలాలు అర్హులకు అందాలి.. ఎమ్మెల్యే
X

దిశ, తిమ్మాపూర్ : ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి ఫలాలు అర్హులకు అందాలని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. గురువారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో దాదాపు రూ.50 లక్షల నిధులతో గ్రామపంచాయితీ కార్యాలయం నూతన భవనం, సీసీ రోడ్లు, మున్నూరు కాపు సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి, బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం పోలంపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచులు తోట మమత, బొజ్జ తిరుపతి, ఎంపీడీఓ రవీందర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed