దొంగ మాటల కాంగ్రెస్, బీజేపీలను నమ్మి మోసపోవద్దు : హరీష్ రావు

by Disha Web Desk 23 |
దొంగ మాటల కాంగ్రెస్, బీజేపీలను నమ్మి మోసపోవద్దు :  హరీష్ రావు
X

దిశ, చందుర్తి : చందుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీష్ రావు హజరైయ్యారు. హరీష్ రావు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మార్పు తెస్తామంటే ప్రజలు నమ్మి ఆగమయ్యారు అని, ఇప్పుడు నమ్మి మళ్ళీ మోసపోవద్దని బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న బోయిన్పల్లి వినోద్ కుమార్ ను గెలిపించాలని కోరారు. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంటు వచ్చేది కానీ కాంగ్రెస్ వచ్చాక కరెంటు కోతలతో మోటార్లు కాలుతున్నాయి అని కాంగ్రెస్ తెచ్చిన మార్పుతో కరెంటు కోతలు వచ్చాయన్నారు. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రిలో కేసీఆర్ కిట్ బంద్ చేశారు, మళ్లీ ఊర్లలో సాగునీళ్లు, తాగునీళ్ల కష్టాలు వచ్చాయి అని కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కల్యాణలక్ష్మి ద్వారా లక్ష వచ్చేది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక కళ్యాణలక్ష్మీ బంద్ అయింది అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో సిమెంట్, స్టీల్ తో పాటు నిత్యావసర ధరలు పెరిగాయి,కాంగ్రెస్ వంద రూపాయల బాండ్ పేపర్లు బౌన్స్ అయ్యాయి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ దేవుళ్లపై ఒట్లు వేసుడు మొదలుపెట్టాడు, అని కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లు వంద రోజుల్లో అమలు చేస్తామని నూట యాభై రోజులైనా అమ్మలు చేయలేదని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఏ గుడి దగ్గరకు పోతే ఆ దేవుడి మీద ఒట్టు వేస్తున్నాడు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నీ జూటా మాటలు చెపుతున్నాడు, ఆ జూట మాటలను ఎవరు నమ్మి మోసపోవద్దని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్లు ఓట్లు అడగడానికి వస్తే మహాలక్ష్మి రూ.2500, రూ.4000ల పెన్షన్ ఇచ్చాకనే ఓట్లకు రమ్మనాలి అని వినోదన్నను గెలిపిస్తే పార్లమెంట్ లో గళమెత్తే గొంతవుతాడు అని అన్నారు.కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 11 సార్లు రూ. 72000 ల కోట్లు రైతులకు రైతుబంధు ఇచ్చారు.కరోనా కష్టకాలంలో ఎమ్మెల్యేలు, మంత్రుల జీతాలు బంద్ చేసి రైతులకు డబ్బులు ఇచ్చాం అని అన్నారు. ప్రజలు తప్పిపోయి మళ్లీ కాంగ్రెస్ కు ఓట్లు వేస్తే దొంగలకు సద్దికట్టినట్లు అవుతుంది అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు, టెక్స్ టైల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పీ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ,ఎంపీపీలు లావణ్య రమేష్, స్వరూప మహేష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లయ్య, తిరుపతి, దేవయ్య, సెస్ డైరెక్టర్ లు తిరుపతి, శ్రీనివాస్ రావు, గంగారాం, పీఏసీఎస్ చైర్మన్లు శ్రీనివాస్, కిషన్ రావు, నరసయ్య, కమలాకర్, మనోహర్ రెడ్డి, బీఎన్ రావు, అశోక్, పెంటయ్య, రాజు, శ్రీనివాస్,ఆనందం, అనిల్, రవి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed