రిజర్వాయర్ మీద ఆధారపడిన రైతులను ఆదుకోవాలి.. సాగు నీటి కోసం రైతాంగం నిరసన..

by Vinod kumar |   ( Updated:2022-11-24 11:42:58.0  )
రిజర్వాయర్ మీద ఆధారపడిన రైతులను ఆదుకోవాలి.. సాగు నీటి కోసం రైతాంగం నిరసన..
X

దిశ, కరీంనగర్: అధిక వర్షాల కారణంగా చెరువులకు వేసిన గండ్లను వెంటనే పూడ్చి యాసంగికి నీరివ్వాలని రైతులు డిమాండ్ చేశారు. గండ్లు పూడ్వకపోతే ఈ సీజన్‌లో తాము వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం గంగాధర క్రాసింగ్ వద్ద రైతులు చేపట్టిన రాస్తారోకోతో కరీంనగర్-జగిత్యాల రహదారిపై ట్రాఫిక్ ఎక్కడిక్కడ స్తంభించింది. గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్, మంగపేట ఎల్లమ్మ చెరువులకు గండ్లను పూడ్చి భూములకు నీరందించాలని డిమాండ్ చేశారు. మరమ్మతులు చేయకపోతే యాసంగిలో లక్షల ఎకరాలకు సాగు నీరందకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరమ్మత్తులు చేపట్టనట్టయితే తమతో పాటు ఎగువ ప్రాంతాలతో పాటు తాము కూడా భూములను బీళ్లుగా వదిలి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుందని రైతాంగం వివరించింది. అధికారులు సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలని వారు కోరారు.

Advertisement

Next Story

Most Viewed