- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ BRSలో అసమ్మతి గళాలు.. మరో రెండుచోట్ల అవిశ్వాస సెగ
దిశ, కరీంనగర్ బ్యూరో : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో అసమ్మతి రాజుకుంటోంది. ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా ఉన్న అధికార పార్టీ కౌన్సిలర్లు తమ వ్యతిరేకతను వ్యక్తీకరించేందుకు అవిశ్వాస పల్లవిని ఎత్తుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో రెండు మున్సిపాలిటీల్లో అవిశ్వాసం అంశాలు తెరపైకి రాగా తాజాగా మరో రెండుచోట్ల కూడా అసమ్మతి గళం విప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
జమ్మికుంటలో..
అధిష్టానం కోర్టుకు చేరిన హుజూరాబాద్ మున్సిపల్ రాజకీయాలపై ప్రతిష్టంభన అలాగే కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గంలోని జమ్మికుంటలో కూడా అసమ్మతి గళం విప్పేందుకు రంగం సిద్దమైంది. 30మంది కౌన్సిలర్లకు గాను 25మంది జట్టు కట్టి తమ గళాన్ని వినిపించే పనిలో నిమగ్నం అయినట్టు సమాచారం. ఈ మేరకు రహస్యంగా మంతనాలు జరుపుతున్న కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కు అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు నిర్ణయించికున్నట్టు తెలుస్తోంది. జమ్మికుంట మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్ పర్సన్ ఇద్దిరిపైనా తమ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. నిధుల విడుదలతో పాటు ఇతరత్రా అభివృద్ధి పనుల్లో ప్రాధాన్యం లేకుండా పోవడం తదితర కారణాలపై కౌన్సిల్ సభ్యులు తమ వ్యతిరేకత ప్రదర్శిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసుపై సంతకాలు చేయగా మిగతా వారంతా సంతకాలు చేసిన తరువాత కలెక్టరేట్ లో సమర్పించనున్నారు. గతంలో ఇక్కడి నుంచి చైర్మన్ గా పదవిని ఆశించిన పొనుగంటి మల్లయ్యను అప్పుడు ఈటల రాజేందర్ పోటీ నుంచి తప్పించడం, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావుకు బాధ్యతలు అప్పగించడం వల్ల తనకు అన్యాయం జరిగిందని మల్లయ్య వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసమ్మతి వాదులందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చే పనిలో పొనుగంటి మల్లయ్య వర్గం పడ్డట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. కాగా జమ్మికుంట మున్సిపాలిటీలో వ్యతిరేకత లేదని చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు తెలిపారు. అవిశ్వాసం పెట్టే యోచనలో తమ సభ్యులు ఎవరూ లేరన్నారు.
వేములవాడలో..
ఇకపోతే వేములవాడ మున్సిపాలిటీలోనూ ముసలం మొదలైనట్టుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికలప్పుడు కొండ శ్రీలతను చైర్ పర్సన్ చేయాల్సి ఉన్నప్పటికీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో మాధవి పేరు తెరపైకి వచ్చింది. మంత్రి కేటీఆర్ కూడా మాధవి అభ్యర్థిత్వానికి అనుకూలంగా ఉండడంతో చివరి క్షణంలో స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు కొండ శ్రీలతను ఒప్పించాల్సి వచ్చింది. దీంతో మాధవికి వ్యతిరేకంగా సుమారు 21మంది కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు లేవనెత్తిన అసమ్మతి గళానికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు జట్టు కట్టడంతో వేములవాడ మున్సిపాలిటీలో కూడా అవిశ్వాసం తప్పేలా కనిపించడం లేదు. అధికార పార్టీకి చెందిన మరికొంత మంది కౌన్సిలర్లు కూడా వ్యతిరేక వర్గంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. దీంతో వేములవాడలోనూ అసమ్మతి గళం వినిపించేందుకు రంగం సిద్ధ మైనట్టుగా స్పష్టం అవుతోంది.
Also Read...
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే ఛాన్స్ .. BRS వర్గాలకు అందిన ఇన్ఫో?