- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలనలో నైజాంను మించిన సీఎం కేసీఆర్ : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ఇష్టారాజ్యంగా ప్రభుత్వ శాఖల కుదింపు
దిశ, సారంగాపూర్ : రాష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్ నైజాంను మించిపోయాడని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాల సంభవించినప్పుడు, ఆపద సమయాల్లో క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి ఆదుకునే రెవెన్యూ వ్యవస్థను వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.
క్షేత్రస్థాయిలో ప్రస్తుతం ఆర్ఐ లు మినహా ఎవరూ లేరని, ఇటీవల టీ.ఎస్.పీ.ఎస్.సీ నోటిఫికేషన్లలో సైతం ఆర్.ఐ పోస్టుల భర్తీ లేదన్నారు. భవిష్యత్తులో ఆర్.ఐ వ్యవస్థను సైతం రద్దు చేస్తారని, రాష్ట్రం ఏర్పాటుతో నూతన ఉద్యోగవకాశాలు మెరుగుపడుతాయాని అనుకుంటే ఉన్న ఉద్యోగాలు కనుమరుగైపోతున్నాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్టు వ్యవస్థ, ఔట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేస్తామన్న సీఎం కేసీఆర్ ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
ఇష్టారీతిన ప్రభుత్వ శాఖలను రద్దు చేస్తూ.. కుదిస్తూ పాలనలో సీఎం కేసీఆర్ నైజాంను మించిపోయారని విమర్శించారు. వీఆర్వోలను ఇతర శాఖలకు బదిలీ చేయడంతో రెవెన్యూ శాఖ కనుమరుగైందని అన్నారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీలపై మెడపై కత్తి పెడుతున్నారని ఆరోపించారు. వారికి విధమైన మదింపు లేకుండా రెగ్యులరైజ్ చేయాలన్నారు. సజావుగా విధులు నిర్వర్తించిన వారి పనితనాన్ని మళ్లీ మదింపు చేస్తామనడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పర్యవేక్షణ, పరిశీలన బాధ్యత రెవెన్యూ శాఖపై ఎంతగానో ఉందన్నారు.
Read More: సిగ్గులేకుండా ఆ విషయం చెబుతున్నారా.. BRS ఎమ్మెల్సీపై ఆకునూరి మురళి సీరియస్