విష జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్త వహించాలి

by Sridhar Babu |
విష జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్త వహించాలి
X

దిశ, జగిత్యాల టౌన్ : విష జ్వరాలు ప్రబలకుండా ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ కోరారు. జగిత్యాల రూరల్ మండలం తిప్పన్న పేట గ్రామంలో హెల్త్ క్యాంప్ ను కలెక్టర్ పరిశీలించారు. గ్రామాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారని, డెంగ్యూ పరీక్షలు చేస్తున్నారని, ఇప్పటి వరకు డెంగ్యూ జ్వరం బారిన ఎవరూ పడలేదని, వైరల్ ఫీవర్స్ వస్తున్నాయని కలెక్టర్ తెలిపారు.

అవరమైన మందులు అందుబాటులో ఉన్నాయా లేదాని కలెక్టర్ రిజిస్టర్ ను చెక్ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సమీయుద్దీన్, జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ ముసుగు జైపాల్ రెడ్డి, డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ ఓ శ్రీనివాస్, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story