- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లాక్కోవడం ఖాయం : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
బీజేపీకి సీనియర్ నాయకులే పునాదులు
దిశ, కోరుట్ల : 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో 33 శాతం ఎమ్మెల్యేలను, 2018 ఎన్నికల్లో 66 శాతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ లాక్కుందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారందరిని 100 శాతం బీఆర్ఎస్ పార్టీ లాక్కోవడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని కటుకం సంగయ్య ఫంక్షన్ హల్లో శుక్రవారం బీజేపీ సీనియర్ నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజలందరికా సమ న్యాయం చేస్తుందన్నారు.
నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వం దేశంలో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తుందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా అవినీతి మాయమేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లో క్వింటల్ కు 10 కిలోల తరుగు తీస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిధులైన గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా రూ.11.50 కోట్లతో కోరుట్ల నియోజక వర్గంలో రోడ్లు వేయించామని తెలపారు. రూ.34 కోట్లతో చెక్ డ్యాంలు నిర్మించామని, ఇలా జగిత్యాల జిల్లా అభివృద్ధికి రూ.కోట్లు వెచ్చించామని తెలిపారు.
ఇతర పార్టీల నుంచి నేతలు బీజేపీలోకి వస్తామని అనేక మంది తనను అడుగుతున్నారని, ఎవరు వచ్చినా వారిని సాదరంగా ఆహ్వానిస్తామని తెలిపారు. కానీ, టికెట్లపై ఆశలు పెట్టుకోవద్దని, అదనంగా కుర్చీలు ఉన్నాయని ఆయన తెలపారు. పార్టీ అభ్యున్నతి, ప్రజా సంక్షేమం కోసం శ్రమించే వారిని పార్టీ నిరంతరం గుర్తిస్తుందని అన్నారు. ప్రజల అభిప్రాయం మేరకే సీటు కల్పిస్తామని స్పష్టం చేశారు. బీజేపీ శ్రేణులు సీనియర్లతో ఉంటూ రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రానున్న ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలువడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పైడిపెల్లి సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్, నాయకులు జే.ఎన్ సునీత, పల్ల గంగారెడ్డి, సాంబారి ప్రభాకర్, దాసరి రాజశేఖర్, మాడవేని నరేష్, పెండెం గణేష్, శ్రీనివాస్ రావు, మోలుమూరి రాజమురళి, పిసరి నర్సయ్య, తిరుమల వాసు, సుదవేని మహేష్, తదితరులు పాల్గొన్నారు.
Read More... ఈటల, కోమటిరెడ్డి పార్టీ మార్పు వార్తల వేళ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు