- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కమలం శ్రేణులు గప్‌చుప్.. బండి రాజీనామాపై నోకామెంట్స్
దిశ, కరీంనగర్ బ్యూరో : బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేయడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బీజేపీ శ్రేణులు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. ఢిల్లీలో పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలను టీవీలు, సోషల్ మీడియాలో గమనిస్తున్నారు. బండి సంజయ్ రాజీనామాపై బీజేపీ నేతలు ఎవరూ స్పందించకపోగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక విషయంలో ఎవరు హర్షించ లేదు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఈటలకు బీజేపీ పార్టీ మరోమారు ‘కీ’ రోల్ ఇవ్వగా ఈసారైన ఈటల తనకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తాడా? అనే చర్చ ఉమ్మడి జిల్లాలో జరుగుతోంది.
కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ బీజేపీ రాష్ర్ట అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తరువాత బండి సంజయ్ సొంత జిల్లా అయిన కరీంనగర్లో బీజేపీ నాయకులు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. 2019 ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా విజయం సాధించడంతో పార్టీలో సంజయ్ ఈమేజ్ భారీగా పెరిగింది. బండి విజయం తరువాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యమయంగా బీజేపీ పార్టీ మారాలని భావించి కీలక పదవిని ఆయనకు అప్పగించారు. సంజయ్‌కు రాష్ర్ట అధ్యక్ష పదవి ఇచ్చిన తరువాత రాష్ర్టంలో బీజేపీ కొత్త ఊపు వచ్చింది. బండి చేపట్టిన ప్రజాసంగ్రమ యాత్రతోపాటు నిరుద్యోగ దీక్ష, నిరుద్యోగ మార్చ్ వంటి కార్యక్రమాలు విజయవంతం కావడంతోపాటు అధికార పార్టీకి బీజేపీ పార్టీ కొరకరాని కొయ్యగా మారింది. బండి సంజయ్ అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచి తెలంగాణలో పార్టీకి పెరిగిన ఇమెజ్‌ను గుర్తించిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతుంది.
బండి స్పీడ్‌కు బ్రేక్..
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మోజార్టీ సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తరుణంలో బండి స్పీడ్‌కు బీజేపీ అధిష్టానం బ్రేక్ వేసింది. మూడు రోజుల కింద ఢిల్లీ వెళ్లిన బండి సంజయ్ బీజేపీ పెద్దలతో చర్చించిన తరువాత పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. బండి రాజీనామా తరువాత ఉమ్మడి కరీంనగర్లో బీజేపీ నేతలు సైలెన్స్ మోడ్‌లోకి వెళ్లారు. అకస్మాత్తుగా బండి రాజీనామా చేసిన విషయంపై ఎవ్వరు నిరసన వ్యక్తం చేయలేదు. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ సంబురాలు నిర్వహించలేదు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఉమ్మడి జిల్లా బీజేపీ శ్రేణులు సైలెంట్‌గా మారాయి.
ఈటల ‘కీ’ రోల్‌గా మారేనా..?
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈసారి అప్పగించిన పదవితో బీజేపీలో ఈటల ‘కీ’రోల్‌గా మారేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ర్ట బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌కు బీజేపీ పార్టీ ఎలక్షన్ మెనేజ్మెంట్ కమిటీ చైర్మన్‌గా నియమించారు. చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్ ఉమ్మడి కరీంనగర్లో జిల్లాలో అనుకున్న స్థాయిలో ప్రభావం చూపించలేకపోయాడనే చెప్పొచ్చు. పేరున్న పెద్ద లీడర్లు ఎవరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి బీజేపీలో చేరలేదు. ఇప్పుడు ఎన్నికల కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్ బీజేపీ పార్టీకి ‘కీ’ రోల్‌గా మారేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: రాష్ట్రంలో మారిన పొలిటికల్ సీన్.. కమలదళం అస్త్రసన్యాసం?