కుంటలో పడి వృద్ధుడి మృతి

by Shiva |
కుంటలో పడి వృద్ధుడి మృతి
X

దిశ, చిగురుమామిడి: కుంటలో పడి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పీచుపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన దానావేన రాములు (80) సోమవారం ముల్కనూర్ వెళ్లి రాత్రి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. తెలిసిన వాళ్ల ఇళ్లు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా, మంగళవారం ములుకనూరులోని రుద్రకుంటలో తేలుతున్న ఓ మృతదేహాన్ని గమనించిన రాములు కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. మలవిసర్జనకు వెళ్లిన క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి మృతి చెందాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై సామల రాజేష్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed