గ్రీన్ జెర్సీలో ఆర్సీబీ ప్లేయర్లు.. అందుకోసమే

by Harish |
గ్రీన్ జెర్సీలో ఆర్సీబీ ప్లేయర్లు..  అందుకోసమే
X

దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు సాధారణంగా రెడ్, బ్లాక్ కలర్ ఉన్న జెర్సీని ధరిస్తారు. కానీ, రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మాత్రం ఆర్సీబీ ప్లేయర్లు గ్రీన్ కలర్ జెర్సీ ధరించి కనిపించారు. వారు గ్రీన్ జెర్సీ ధరించడం వెనుక ఓ కారణం ఉంది. ‘గో గ్రీన్’ క్యాంపెయినింగ్‌లో భాగంగా ఆకుపచ్చ జెర్సీని వేసుకున్నారు. 2011 నుంచి ఆర్సీబీ ‘గో గ్రీన్’ క్యాంపెయిన్ చేపట్టింది. ప్రతి సీజన్‌లో ఒక మ్యాచ్‌లో ఆ జట్టు ఆటగాళ్లు గ్రీన్ జెర్సీతో మైదానంలోకి దిగుతారు. పర్యావరణ ఆందోళనలు, చెట్ల పెంపకం, గ్లోబల్ వార్మింగ్‌ను ఎదుర్కోవడం వంటి విషయాలపై అవగాహన కల్పించడం ‘గో గ్రీన్’ లక్ష్యం.

ఆర్సీబీ ప్లేయర్లు ధరించిన జెర్సీలు 95 శాతం రీసైకిల్ చేసిన మెటీరియల్స్‌తో తయారు చేసినవని ఫ్రాంచైజీ యాజమాన్యం తెలిపింది. ‘95 శాతం టెక్స్‌టైల్, పాలిస్టర్ వ్యర్థాలతో ఆర్సీబీ జెర్సీలను తయారు చేశాం. పూమ రీఫైబర్ ఫ్యాబ్రిక్ ద్వారా నాణ్యత కోల్పోకుండా చాలా సార్లు రీసైకిలింగ్ చేశాం.’ అని ట్విట్టర్ వేదికగా తెలిపింది. అయితే, ఈ స్పెషల్ మ్యాచ్‌కు ఆర్సీబీకి పెద్దగా కలిసిరాలేదు. ఇప్పటివరకు గ్రీన్ జెర్సీ ధరించి బెంగళూరు 14 మ్యాచ్‌లు ఆడింది. అందులో నాలుగు విజయాలు మాత్రమే నమోదు చేయగా.. 9 మ్యాచ్‌ల్లో ఓడింది. మరో మ్యాచ్‌లో పలితం తేలలేదు. మరి, రాజస్థాన్‌పై గెలుస్తుందో లేదో చూడాలి. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 4 వికెట్లు కోల్పోయి 173 రన్స్ చేసింది. బెంగళూరు 174 పరుగుల లక్ష్య ఛేదనకు దిగింది.




Next Story

Most Viewed