- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆలిండియా ఎన్.సీ.సీ ట్రెక్కింగ్ ట్రైనింగ్ క్యాంప్‌కు పారమిత విద్యార్థి
దిశ, కరీంనగర్ టౌన్ : రేపటి నుంచి వారం రోజుల పాటు ఆలిండియా ట్రెక్కింగ్ క్యాంప్ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న ఎన్.సీ.సీ ట్రైనింగ్ క్యాంప్ కు పారమిత ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి ఎ.సాయి షణ్ముఖ్ అర్హత సాధించినట్లు హచ్.ఎం బాలాజీ తెలిపారు. ఆలిండియా ఎన్.సీ.సీ ట్రెక్కింగ్ క్యాంప్ ఆధ్వర్యంలో ప్రతి రోజూ 20 కి.మీ చొప్పున ఎన్.సీ.సీ విద్యార్థులకు వివిధ విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సాహసోపేత ట్రెక్కింగ్ క్యాంపుకు అన్ని రకాల అర్హత సాధించిన సాయి షణ్ముఖ్ ను 9వ బెటాలియన్ సుబేదార్ మనోహర్ సింగ్, పారమిత పాఠశాలల అధినేత ప్రసారావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యాసంస్థల డైరెక్టర్లు ప్రసూన, రాకేష్, రశ్మిత, అనుకర్ రావు, వినోదరావు, హనుమంతరావు, హెచ్.ఎం బాలాజీ, ప్రశాంత్, కవిత, ఎస్.డీ.వో తిరుపతిరావు, స్కౌట్ మాస్టర్ రామ్ సాయి పాల్గొన్నారు.